28, ఫిబ్రవరి 2019, గురువారం

అంతనేనే : Telugu Attitude kavithalu,Telugu kavithalu,Telugu quotes

అంతనేనే : Telugu Attitude kavithalu,Telugu kavithalu,Telugu quotes

                                             
www.telugukavithalu.in

అంతనేనే

నేనే కలాన్ని
దాని పదాన్ని
ఫలాన్ని నేనే
ఆకలిని కూడ
కామ క్రోధ భయ మధమాచర్యల్ని
బలిసిన ఏనుగుల బలాన్ని

జలాన్ని నేనే
మధుర దాహాన్ని నేనే
కొట్టుమిట్టాడుతున్న కొనలేని కోటి కదలికల భావాల్ని
వాటి పవిత్రత నేనే

తెగిపడుతున్న తలల్ని
నరికిన కత్తుల కోనల రక్తపు మరకల్ని
చితిమంటల్లో చితికిపోతున్న బతుకుల్ని
చచ్చిన శవాల్ని

నేనే స్మశానం
కప్పిన కట్టెల్ని
కాలుతున్న కాయాన్ని
ఎగిసిన మంటని
మిగిలిన బూడిద అర్థం నేనే

నేనే భయాన్ని
దాని అవసరాన్ని
పర్యవసనాన్ని కూడా
వితంత వితుల వితండ వికారపు వాదాన్ని
అరుపుల్ని నేనే
విదాత నేనే.

కాలం నేనే
దాని వెనుక కథనం నేనే
కాలున్ని నేనే
కామం నేనే
కార్యం నేనే
ముగిసిపోయినా జీవితాన్ని తెంచి పొత్తిళ్లలో తేలిన పాపని నేనే

మదరూప మగాన్ని
అతి శీతల ఆడదాన్ని
కన్యల్ని దాని అందాల్ని
నేనే

పురాణాల పురుషార్థం నేనే చరితల పుటల్ని
మహాభారతపు పర్వాలని
రామయణపు ఖండాల్ని
భాగవతపు పద్యాల్ని
భగవద్గీత సారాన్ని నేనే.

నేనే
నేనే నేనే అంత
సకలం నేను సర్వం నేనే
నాకూ నేనే
నేనేంటో కూడా నేనే
నేనే

ఆహా: బ్రహ్మస్మి

దైవం మానుష్య రూపేణా:

For More Telugu kavithalu, Prema kavithalu Telugu please follow us.
If you want this Telugu Kavithalu On your whatsapp please Type "Kavithalu" and send to my whatsapp.

Whatsapp📱:9951017979
🖋:సృతన్

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి