20, ఫిబ్రవరి 2019, బుధవారం

నిరీక్షణ : Telugu kavithalu,Telugu prema kavithalu,telugu quotes

  నిరీక్షణ: Telugu kavithalu, Telugu Prema kavithalu, Telugu quotes                                                              


www.telugukavithalu.in
This posts only for you my Telugu friends for more Telugu kavithalu, Telugu love kavithalu, Telugu Prema kavithalu and Telugu quotes please follow us.

నిరీక్షణ

సీతాకోకచిలుక రెక్కలోంచి,సముద్రపు అలల పక్కనుంచి,ఎర్రని రోజాపువ్వులోంచి లేదా తొలిపోదులోంచి,మబ్బు రాల్చే మొదటి చినుకులోంచి నువ్వువస్తావని నన్ను లాలిస్తావని ఎంతగా వేచిఉన్నానో, ఎంతగా ఎదురుచూసానో నీకు తెలియదు.

సముద్రపు నీరు ఉప్పగా ఉంటుంది అని తెలుసు,అమావాస్య నాడు అంతటి ఆకాశం అణువంత వెన్నెల పంచలేదని తెలుసు కానీ నా ప్రేమకు ప్రాణం ఉందొ లేకుంటే నా ఊహకైన రూపం ఉందొ, ఉంటే ఒక్క క్షణమైనా మెరుపులా మెరిసి నా జీవితానికి వెలుగునిస్తుందో లేదో తెలియదు.

గాయంగానో,జ్ఞాపకంగానో,ఆశగానో,శ్వాసాగానో,కలగానో,కన్నీటి దారగానో దూరంగానో, లోపాలో లేక వెలుపలో ఎలాగలో ని రూపం కోసం ని రాక కోసం కన్నీళ్లతో కంటి పొరలు కమ్మినప్పుడు,గుండేతలుపులు తెగినప్పుడు,ఒంటరితనంతో దిగులు తెగులు అలిమినప్పుడు నువ్వుంటే బాగుండు అనిపిస్తుంది,నీతో మాట్లాడలనిపిస్తుంది.

*నేను ద్విపం నువ్వు సముద్రం*
*నేను దేహం నువ్వు ఊపిరి*

నీకై "నిరీక్షణలో" ఎన్ని ఋతువులు,ఎన్ని రంగులు,ఎన్ని కాలాలు,ఎన్నెన్ని క్షణాలు,నికై అన్వేషణలో ఎన్ని జీవితాలు,ఎన్నో జ్ఞాపకాలు నిన్ను చూడకుండ,,ని స్పర్శను తాకకుండా ని నవ్వుల నదిలో మునగకుండ ఈ కాలం అనే ప్రవాహంలో కలిసిపోతాన? కడవరకు ప్రేమ కరువుతో అల్లాడిపోతానా?

If you want this kavithalu on your whatsapp please type "Kavithalu" and send to my whatsapp number we will add in your group.

📱:9951017979
🖋:సృతన్

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి