Saturday, February 23, 2019

ఓ! నా నిశి


                                              ఓ! నా నిశి

www.telugukavithalu.in

ఓ! నా నిశి

ప్రియా!
మహోదదిలా నీ స్వరం.
యుగయుగాలా శూన్యపలకాలపైన
ఎగిసి వస్తున్న శృతి వలయం
ని పరిచిత కంఠం
ప్రత్యక్ష నిక్షేపాలుగా పోసిన
రవి తొలి కిరణం

ఓ! నా
వినూత్న చైతన్య సృజనమా!
ని శ్వాసలు
పసిడిపండే మాగణులు
నా మరణ దూమాన్ని ఊదేసే
జీవన పవనాలు
నా నిత్యశాసనాన్ని మార్చే
నిత్య శిశుదయాలు

ఓ! నా చెలి
మండిపడే గ్రీష్మంలో
మబ్బుకలలు నారుపోసుకుంటూ.
సమజీవన దహణంలో
సహమనసా హాననంలా!.
కలిసిపో నాలో.
Whatsapp📱:9951017979
🖋:సృతన్

No comments:

Post a Comment