Sunday, March 17, 2019

ఏ దేశం నాది


                                  ఏ దేశం నాది

                               
www.telugukavithalu.in

ఏ దేశం నాది

రా! ఇటు రా!
ఓ నైలు నది
పరిగెత్తుకుంటు,ప్రవహించుకుంటు
కారణం లేదు సందర్భం కూడా
ఏ సముద్రంలో కలవక
ఎదురచ్చినవాన్ని వదలక
చంపిన,ముంచిన ఈ క్షణం
ఆనందమే,అద్బుతమే ఈ కావ్యంలో

ఎర్రసముద్రాలు ఎండిపోని
కాస్పియన్లు కరిగిపోని
ఐనా ఆగకు వేగం పెంచు
నిత్యం నికృష్ట నీరాజనాలు చేసె
ఆఫగణిస్తాన్ని వదులు
అంతకంటే పాపం ముందుంది
రా!
అనిపిస్తుందా ఇదేదో రాకాసుల భోగించు రాజ్యమని
అది ప్యాకేయుల పాపపు రాజ్యం
వదిలేయ్ రా! ముందుకు

ఆ హిమాలయాలని తాకు
అదే నీకు చివరి ఆనందం
నా తల్లిని ముద్దాడు
ఏడుస్తుంది అని ఆగకు

ఇంతకు నీకు కారణం చెప్పలేదుగా

ఇది నా దేశం
రసమయం,రమణీయం
సుజాలం,సుపలం, సస్యశామలం
నేను చెప్పినదానికి వ్యతిరేకంగా ఉందా!
ఐతే విను
నా భారతదేశం

గతమంత గణులే
జై కొట్టిన జనులే
చరిత మొత్తం వైతాళికులే
నేడు

నా గంగా నది పాపపు నది ఐనది
నా హిమాలయ,వింధ్య,సాత్పురా,ఆరావలి
అలాంటివే అవి మారవు

మారింది
ఈ కుక్కల మనుషులు
మా నీచపు మనసులు

ఓ నైలు నది ఎక్కడ కామమే ఉందా!
అందరిని ముంచి అటు వెళ్లు
ఆ కన్యకుమారిన ఆగి ఆలోచించి
నిచులం మేము భారతీయులం
కానీ నా తల్లి కాదు
ఇది స్వర్గం,దైవం,స్వేచ్ఛ,శాంతి
నా దేశం నా ప్రాణం
ఒక్క మాట కూడా నా దేశాన్ని అనకు

మళ్ళీ విను నిచులం మేము
ఓ నైలు నది అందరిని ముంచేసావ్
నీకు పాపం లేదు
నా దేశాన్ని తకావు ని పాపం పోయింది
ఇక హిందులో కలిసి తిరిగి వెళ్లిపో
జై హింద్

Whatsapp📱:9951017979
🖋:సృతన్

No comments:

Post a Comment