1, మార్చి 2019, శుక్రవారం

ఆ కొంచం వర్షం : Devotional Telugu kavithalu,telugu Quotes

ఆ కొంచం వర్షం : Devotional Telugu kavithalu,telugu Quotes

                                                                     
www.telugukavithalu.in

Friends this beautiful Telugu kavithalu only for in this page you will get Devotional Telugu Kavithalu. Friends and we have prima kavithalu, Telugu quotes so please follow us for more interesting Telugu Kavithalu

ఆ కొంచం వర్షం

ఎవరికి చెప్పాలి
ఎవరికి తెలియాలి
రాల్చిన కన్నీటి బొట్టుని
నువ్వు చూడాలి
నువ్వే చెప్పాలి
మిగిలిన మురికిని
నువ్వే కడగాలి.
కురిపించు కృష్ణా
ఆ కొంచం వర్షాన్ని.

ఎక్కడైతే కామంతో
కుంచించుకుపోయినా నా దేహంలోని
ప్రతి కణం కణం కడిగేలా
కురిపించు.

ఎప్పుడైతే నిన్ను విడిచి
నా దారి పోయానో
అక్కడే ఇప్పుడే
కురవని ని వర్షాన్ని

గతాల ఎడారులు
భయాల కరువులు
అన్ని పుష్పించేలా
మళ్ళీ నిన్ను నాపై మోసేలా
కురిపించు ని అమృతవహిణిలా జలదారని.

ఏడ్చి ఏడ్చి ఇంకిపోయిన
గుండెలోని చేరువుని నింపేలా
నా కన్నుల కుండలు నిండెలా
మళ్ళీ నీకై కన్నీళ్ళు రాల్చేల
కురిపించు..కృష్ణా.

నువ్వులేవని అరిచి అరిచి
ఎండిపోయిన గొంతు
మళ్ళీ నిన్ను పలికెల
దాన్ని దాహం తిరేలా
కురిపించు..కృష్ణా. కురిపించు.

ఒక్కసారి మళ్ళీ హత్తుకొని
నా భుజాలపై ఎత్తుకొని
ని దారికి రానియ్

ఇంకా ఏమూలనో ఉన్న
అచింత జఠిలంత విముఖత కామపిడిత వ్యతిరేకత
చిలుముని కడగాలి
కురిపించు.. కృష్ణా
ని పాదాలు కడిగిన గంగా ని
ఇప్పుడే మళ్లీ మళ్ళీ
కురిపించు.. కృష్ణా
నే మళ్ళీ పుట్టేలా
నిన్ను మొక్కేలా.

యదా: కృష్ణా! తదా: కృష్ణా! సదా: కృష్ణా!

యద్భావామ్: తద్భవతి.

If you want this kavithalu on your whatsapp then type "Kavithalu" and send to my whatsapp we will touch you soon.

Whatsapp📱:9951017979
🖋:సృతన్

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి