Monday, March 25, 2019

మనిషి


                                               మనిషి                           

www.telugukavithalu.in

మనిషి

రామయణపు రగడ తెలిసి
ఆ భారతపు గీత చేరిచి
భాగవతపు భయం మరిచి
వేదాలను వెర్రి చేసి
బూచిలగా తిరిగేవు
కామందుడవై బ్రతికేవు
క్రూరత్వానికి మరిగేవు

కుల,మతముల కంపుల కి
ధన,లాభాల మొహంపై
బానిస పాదుకలతో నడిచెవు
న సిగ్గువై,న లజ్జవై తిరిగేవు
ని కొమ్మని నరికై మూర్ఖడవు
నీ తల్లినే చంపే నిచూడవు
ఇషి.... నిది ఓ!బ్రతుకేన

ఆ దిక్కుకి పోవేందుకు?
ఆ ధిక్కారం అసలెందుకు?
ఆ దిక్కుకి నడవవెందుకు?
ఆ మొండిపట్టు విడవెందుకు?
ఆ దిక్కులే సర్వ సుఖాలు
ఆ దిక్కులే అసలైన ఆనందాలు
ఆ దిక్కులే అ దిక్పాలుడి దిక్కులు

శూన్యమైనది ప్రేమించి
అసాధ్యాన్ని కామించి
మదం తో శోభించి
సర్వం నేనే అని తలిచి
మత్తు నావలో ప్రయాణించి
సంద్రములో మునిగెవు
వైతరిణిలో! తేలేవు

నీవు!
విత్తనమును చీల్చుకొని
మొలకెత్తిన పుష్పము
సుగందంబులు వెదజల్లక
నడి వేసవిన వాలిపోయేదవ
సర్వం ప్రేమై బ్రతికి
ఆ పుణ్యపాదల దరి చేరేదవా!

ఓ!జేడదారి ఇటు చూడవయ్య
ఓ!నీరేశ్వర ఇ దిక్కుకి రావయ్యా
ని రచన మార్చు ఓ!బహు తలలోడ!
మార్చరెందుకు?
ఇ కింకర రౌతుల కుంపటి దారులు
నింపేరెందుకు మాధారులలో
మీ సుగంధ గుణములు.

🖋:సృతన్
Whatsapp📱:9951017979

No comments:

Post a Comment