Wednesday, March 27, 2019

ప్రజాస్వామ్యం


                                     ప్రజాస్వామ్యం


www.telugukavithalu.in

ప్రజాస్వామ్యం

ఇది ప్రజాస్వామ్య
ఆవివేక దీపిక
పలికేది విషపత్రిక కాదు
పలకబారిన అధికారం నాలుక
వింటున్నది చెరసాల కాదు
విచలించని వివేక దీపిక

జ్ఞానం అగ్నిలో దగ్దమై
మదం అధికార పీఠమై
"లజ్జ"లేని బ్రతుకులు
మహోర్ణవ గోశల్లో మునిగిపోతున్నాయ్.

రేయ్! స్మశాన పినుగులరా

బ్రతికేదెందుకు ఈ ప్రజాస్వామ్యoలో
వేడికన్నీరు తొలిగించుకుంటూ
తెగిపోతున్న స్వరాన్ని ముడివేసుకుంటూ
ఆగిపోతున్న శ్వాసాల్ని సాగదీసుకుంటూ.

తెగించు...! గుర్తించు

సాగె గాలిని బందీస్తే ఉబికివస్థాయి
కల్లోలాలు
మరి ప్రశ్ననీ బందీస్తే ఉదయిస్థాయి
"పోరాటాలు".
ఈ కుక్కలు నక్కలు పరమన్నo
తింటుంటే
ఈ ప్రజాస్వామ్యం సమస్య పురాణo కాకా!
ధ్యాన ప్రేరణ రహస్య ప్రేరణo అగునా!.

ఓ! సోమరి కొడకల్లరా...
జ్ఞానం కట్టిన వారధీకి
నువ్వే ఒక చైతన్య వారధి ఐతేనే
ప్రజాస్వామ్యం ని స్వామ్యం అవుతుంది.
Whatsapp📱:9951017979
🖋:సృతన్

No comments:

Post a Comment