Tuesday, March 26, 2019

ప్రశ్నా


                                               ప్రశ్నా                                             

www.telugukavithalu.in
                             

ప్రశ్నా

నిశిధి నీడలో
అమృతపు అమవాస్యలొ
పచ్చటి సృష్టిరహస్య శోధనలో
వెతుకుతున్నా
జ్ఞానపీఠికలను
ద్యానవాటికలను
బదులు దొరకని ఆడుగులను!

ఏ దాత్తుగర్భంనుండి ఎదిగిన మానునో
ఎలా కుదించుకున్నానో
ఎంత మొలకలో అంతటి శాఖలు.
ఎలా పొదూగుకున్నానో
ఇంతటి మెనులో అంతటి భావాలు.

తరువులా పెరిగి
తిరిగి చూసుకుంటే
ముసురుకొస్తాయ్ హరితవృక్షాలు.
మొక్కపొత్తిళ్ల నుంచి,
కొమ్మల పందిళ్ల దాకా.

"అమ్మ" ఒడినే ఆనంతవిశ్వమానుకొని
స్తన్యంలోనే సమస్త మధురిమలందుకొని
బురదను పిసికి
బుగ్గలను పూసుకుని
ఆకాశంలోని జాబిల్లిని
అద్దంలోకి దింపుకొని
తాకిన పూల రేకులన్ని
తరణి  పెదవులనుకొని

ఏందాక ఈ నడక?
ఈ అడుగు సాగినందాక
ఎన్నాళ్ళు సాగుతుంది అడుగు
సురళబిశ్వాస ఆపేవరక?

ఏమౌతుంది ఆ పైన

అగుపించిన సాగుసులన్ని
మగువగా మలుచుకొని
అల్లుకున్న స్వప్నాలన్ని
అకృతులుగా నిలుపుకొన్నంతవరకా?

ఇది ప్రశ్నగా మిగిలిన ప్రశ్నా?.
Whatsapp📱:9951017979
🖋:సృతన్

No comments:

Post a Comment