Tuesday, March 19, 2019

ప్రేమైనందువల్లా!


                                    ప్రేమైనందువల్లా!

www.telugukavithalu.in
                             

  ప్రేమైనందువల్లా!

గాఢాంధకారంలో
ఏ గతికి ప్రయాణిస్తున్నావే
దిగిన ముళ్ళు తాకిన రాళ్లు
వ్యర్ధాలు అవుతున్నాయేలా
ఇ రహస్య శూన్యం ప్రేమైనందువల్లా!.

నువ్వు చూసిందే వెలుగౌతుంది
నడిచిందే దారి అవుతుంది
పలుకుతుందే పదం అవుతుంది
ఎంత వింత ఆకారమైన
ని చెంత కొంత వంగినది ఎలా!

విశ్వకర్మతో చెక్కించుకున్నవా
బ్రహ్మతో రాయించుకున్నవా
వ్యాసుడైన రాయగలడ
అర్చనలు అపలేని అందాన్ని.

అరుణోదయం ఊరుకోదు
కిరణాలను సారించనిదే
వసంతోదయం ఆగిపోదు
పరిమళాలను పారించనిదే
నీరు ఊరుకోదు
పల్లం చివరిని చేరనిదే.

నేడు పంచభూతాలు నిన్ను చూసి
ప్రాణహరణ గుణాన్ని దిగమింగుకుంటూ
పరితపించుకుంటున్నాయ్.

మళ్ళీ పుట్టిన మోహినివా?
అడగలేక ఆగిపోయిన పెదవిని
తాకి మరి చెప్పు ని రహస్యం.
Whatsapp📱:9951017979
🖋:సృతన్

No comments:

Post a Comment