Tuesday, April 9, 2019

భగవద్గీత జైత్రయాత్ర


                                  భగవద్గీత  జైత్రయాత్ర

                                                                     
www.telugukavithalu.in

భగవద్గీత  జైత్రయాత్ర

భగవద్గీత  జైత్రయాత్రలో
అంతటా శవాల కుప్పలే
పీనుగ పెంటలే
హింసోల్బణంలో కుళ్ళిపోయిన
మాంసకండల దిబ్బలే.

రణోన్మాదం ముదిరిన ఖడ్గలు
ఉక్కు నాల్కలు సాచుకుంటూ
గాలిలో మూల్గుతున్న "మహాభారత" గర్భశోకాన్ని
కహాకహా ధ్వనులతో నిలదొక్కుకుంటూ
నడుస్తున్నాయి విచ్చలవిడిగా
ఉగ్రమదం ప్రజ్వలించి
చచ్చిన చంటిబిడ్డల శవాలు
"కురుక్షేత్రం" సరసనిల్వగా

కృష్ణా!

వింటావా ని కీర్తిగానం
గుంటనక్కల గుంపునోట
కుళ్ళిన శవాలను పీక్కుతినే
బొల్లి గద్దలున్నచోట.
ఎదురులేని విభవా!
ఎలుకో ఇక
ఈ స్మశానాలను.
Whatsapp📱:9951017979
🖋:సృతన్ 

No comments:

Post a Comment