Wednesday, April 3, 2019

దశావతారం


                                           దశావతారం

www.telugukavithalu.in

దశావతారం

అర్పింతు
సనజాజుల,విరాజాజుల,మహిజాజుల
మహోత్తమ,ఉత్తమోత్తమ,సర్వోత్తమ
మునిశోబితా,హరశోభిత,బ్రహ్మశోభిత
సర్వశుభములు ని పాదలక్రిందే
దర్షింపచేయు జ్ఞాన,కర్మ దర్పము
ని
దశావతారం
ని వాక్యమే నా వ్రాతలుగా....

దరణిని ఉద్దరించగా
పుడమిని మరల పుష్పింప సేయగా
సర్వ అజ్ఞానం సంద్రమున ముంచి
సర్వోత్తమ విజ్ఞానం అ ఒడ్డుకు చేర్చగా
నీవు నీయందు నిలిచి
నీవే సంకల్పించిన నావల ఉత్సవం
ఆది అవతార మచ్యం
ఓం నమో:నరాయనాయనమః

దద్దరిల్లిను దిక్పాలకులు
మూర్ఛనొందెను సర్వ అసురులు
మహత్కార్యం నీరుగారెను
మహాభారమయే గందలేమి
సర్వ భారాలు తనపై మోయగా
నిరాశ నిట్టూర్పులు పేకలించగా
ఉదయించిన అవతారం
లీలదరుడి కూర్మం

ఓం నమో:నరాయనాయనమః

విచిత్ర చిత్ర నాటకం
మహాగోరా కల్లోలం
వసుద మాత నయనం
కోరే ని అభయం
అగోర కల్లోల రక్కసుని వదించగ
వర్దిలే ఓ అవతారం
కనులకది ఆది వరహం
మనోనేత్రమున నీ స్వరూపం

ఓం నమో:నరాయనాయనమః

దిన బాంధవ రక్ష
లోకనాయక రక్ష
కమలకోమలయా రక్ష
రక్ష
ఓ నారాయణా రక్ష
ముక్త కంఠమున ఓ తేనే పలుకు
ప్రాణములు లెక్కసేయగా ప్రహ్లదుడు
ఆ ప్రాణం రక్షించగా
ఆ పాపం బేరుకగా
వేల సూర్య కాంతితో
రుద్రుని మించిన శక్తితో
ఉద్బవించే నృసింహం
ప్రళయమే ఆ కోపం
అగ్నియే ఆ ఆకారం
నశించే సర్వ రక్కస లోకం

ఓం నమో:నరాయనాయనమః

ఎచటనుంచి వచ్చేనో ఈ రూపం
కమల పదాల విభుడు
తేనే కనుల సర్వుడు
వామన నామ కళ విభుడు
అర్జీoచే మూడు అడుగులు బలిని
ద్వి పాదాలు భూ సహిత
సర్వ సృష్టి కాగా
బోధపడే బలికి
అతడె సృష్టి అని
స్వీకరించే మూడో అడుగు
ఆ బ్రహ్మ కడిగిన పాదం తాకి
చరితార్థుడయే

ఓం నమో:నరాయనాయనమః

సర్వ లోక కంఠక0
క్షత్రియ కుల ఆగడం
సంభవామి యూగే యూగే
అని మరిచితిరేమో
మహా మహా అద్భుతం
పరుశు దారుని జననం
కోట్ల విలయాల సూచికం
రక్త వర్ణ తర్పణం
క్షత్రియ కుల కండనం
ఇది పరుశురామ వర్ణనం

ఓం నమో:నరాయనాయనమః

లోకమెలిన పాదుకలు
రాతిని నాతిగా మలిచిన పాదాలు
ని కనులే ధర్మం
ని దేహమే సత్యం
మానవుడే మహిమాన్వితుడని
నిరూపించే ధర్మ జీవితం
సత్యం శివం సుందరం
రామ
నీవే పరమాత్మ0
నీ నామమే పరమానందం

ఓం నమో:నరాయనాయనమః

ఏమి వర్ణింపను
ఏ కలముతో లికించను
రాసిన రాయగలన ని లీలను
చెప్పిన పూరించగలన నీ నిజమును
గోవులోక నందన
గోవర్ధన గిరి దారణా
నరక కంససురుల సంహరణ
ని మహిమలు శాశ్వతం
నీ గితే మార్గ దర్శనం

బుద్ధుడైనా కల్కిఐనా ఏ రూపమైన
ఓ విశ్వరూప ని మాటే మరోసారి
సంభవామి యూగే:యూగే

Whatsapp📱:9951017979
🖋:సృతన్

No comments:

Post a Comment