17, ఏప్రిల్ 2019, బుధవారం

ఎదురుచూపు

                                       ఎదురుచూపు 

                                                                         
www.telugukavithalu.in

ఎదురుచూపు 

ఎదురొచ్చింది శ్రావణమేఘం
మాటలను కప్పుకొని
అర్ధాలు అల్లుకొని
వర్షించిది ఆనంతముఖాలుగా
కానీ ని మొ:ఖం కానరాదే
నా ఎదురుచూపు
ఘోషించింది కడలికెరటంలా
నీకు వినిపిస్తోందా?
ప్రతి క్షణం ని తలపులే
పులకించాయి పున్నమికిరణంలా
నిపై ప్రసరించలేద?
కలిసినప్పుడే ని బింబం
పొంగులెత్తిన గుండెలో బంధించినపోయేది.
దాగలేని ప్రేమ తరలమన్నది
ని నీడనైన తాకమని
పలుకుతుంది ప్రాణం ని నామం
మదిలోని ప్రతి వేదన
పెదవికి రప్పించుకొని
ని తలపులతో మొదలైన ఉదయం
నీకై పరితపించిన అలుపులతో ముగుస్తుంది
రాధ!నైన కాకపోతిని
ప్రతిక్షణం ని అంతరం కలగనడానికి
నా ప్రతి మాధుర్యం
బాసలాడి రాసనిలయం అవ్వడానికి
ఓ! వసంత మేఘమా
నా ఎదురుచూపు కన్నీటిని
తనపై కురిపించి ఒప్పించు
నాకై రమ్మని
       రాధాకృష్ణ!

Whatsapp📱:9951017979
🖋:సృతన్

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి