Monday, April 8, 2019

ఎవడవు నీవు


                                         ఎవడవు నీవు

www.telugukavithalu.in

ఎవడవు నీవు

కొండలను పిండి చేసి
బండలను ఇంట పరిచి
పరుపులపై పవలించి
నయణలతో నిదురించి
సోమరివై బ్రతికేవు
దేశ సేవ ఆంటే రాబోవు
ప్రాణం అంటే పోబోవు.


పర మనిషిని చూడవసలు
బుక్కెడు బువ్వ కుడ పెట్టబోవు
కానీ!
కనకంబులు కావాలె
శునకంబులు పెంచలే
మనిశి ఆంటే నీవు కావు
శునకంబులకు సరి తూగవు.

ఆ భూమి నాదే ఈ భూమి నాదే
ఎదురునిలిచిన శేవమై కులే
చి...!
ఎవడవు నీవు!
ఎవడవు నీవు!
ఎవడవు నీవు!
మనసాక్షి కీ తెలుసునులె.

లయకరుడి మెరుపులేవి
నడి సంద్రమున నావలు ఎక్కడ
ఈ గాలిలో స్వత్చాత ఎక్కడ
మంచుల కరిగినవా?
మంటలలో కలినవా?
తుఫానులో తులినవా?
మన స్వార్దానికి సచ్చినవా?

వనికెను భువన బవ బండారలు
కదిలేను భూ పొరలు
రగిలేను అగ్ని పర్వతాలు
ప్రళయపు న్యాయమా?
విలయపు సూచికన?
మన బుద్ధికి ప్రతి  చర్యనా?
మన పనులకి ప్రతికరమా?

చుక్కలలో దాగినోడు
చూడనైన చూడలసాడు
చంపేవాడు!
చచ్చిన చోటే బ్రతుకునిచేవాడు
ఉంటే రాడేందుకు
వచ్చిఉంటే మార్చడేందుకు
ఆ!భగవంతుడు..
Whatsapp📱:9951017979
🖋:సృతన్ 

No comments:

Post a Comment