Thursday, April 4, 2019

నభౌజాతి


                                        నభౌజాతి

www.telugukavithalu.in

నభౌజాతి

రాచగోరీల్లో తొక్కిపెట్టిన నిశ్వాసాలు
దొరగడిల్లో మూర్తీకట్టిన జననరహస్యలు
బతుకమ్మ జాతరలో బ్రతుకు పాటలు
మూడుకాలాల్లో కళ్ళకు కట్టిన జీవదృశ్యాలు
గంగలో జారవిడిచిన ఆడుబిడ్డలు
ముంగిటిలో ములిగిన మగ తాతలు
అబ్బ సొమ్మని నింపిన ధనవాటికలు
అపలేదుగా కుక్క చావులు
లెక్కలేనన్ని మూతి ముడుపులు
తొక్కిసలాటలో చావు డప్పులు
మద్యమద్యనా
కలువల కళాభాషణలు
చిగురుకెంపుల ప్రసరణలు
పండువెన్నల ప్రచురణలు
మళ్ళీ మొదలైన జాతి కెరటాలు
ఉద్దీపనంలో ఊగిసాలటలు
నరకరాత్రిలో రాసలీలలు
ఉడుకునెత్తితో దేశ ఆలోచనలు
చెలి తిప్పలు
మలి అప్పులు
గెలి కప్పలు
హొలీ రౌతులు
కలిపి కలిపి జాతి అర్ధాలు
మసిగేదెలా రాసేదెలా నభౌజాతి మనుగడ కథలు కృష్ణా!
Whatsapp📱:9951017979
🖋:సృతన్

No comments:

Post a Comment