13, ఏప్రిల్ 2019, శనివారం

పెళ్లి

                                               పెళ్లి

www.telugukavithalu.in

పెళ్లి

కేళివణుల సందిళ్ళలో
వాలుసందేల పందిళ్ళలో
స్వప్నాల పరిధులు దాటి
సాగింది హృదయం చెలిమికి
ఒక దృశ్యం నశించి
ఉదయించింది ప్రేమ సావ్యం
గాంధర్వగంగల జలం తెచ్చి
ఉషస్సు పరిణయ వేళ
కాళ్ళకు పోసి
పరిమలకుసుమతల్పాల నౌకలతో
సేవించే యశస్సు నా భాగ్యమౌ
మునుపు లేనిది కలిగి
హంసవర్ధనాలు పొదిగి
మేరుపర్వత ఛాయా తీసి
నారద తుంబుర గానం మేళవించి
దివితారల కాంతి రంగరించి
సకల వైభవం పొందుపరిచి
చేసిన నా ప్రాణ ఘటిక ఆభరణం
ని మెడపై ఊగిన వేళ
సమ్మతం అనే వాచకం
అభూతకల్పం కాగా
లీలాన్మదుడు సాక్షిగా రాగ
పరిణయ శుభ వేళ
న:భూతో న: భవిష్యతి
అ దృశ్యం.

Whatsapp📱:9951017979
🖋:సృతన్

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి