5, ఆగస్టు 2019, సోమవారం

పంతం Telugu Motivational Kavithalu

                                         పంతం

www.telugukavithalu.in

పంతం

ఎదురుపడునా? ఏ అపజయం
రథం,పథం,పౌరుషం జీవితమైతే
ఓడిపోయిన గతం
గతమై పోయేనేప్పుడో
అనగారనికు పంతం
కటికచికటైన దారి మొత్తం
నిశీధిలో మెరుపుల వెలుగులులెందుకు
ప్రతి క్షణం వెలుగుల మననం
వెలిగిస్తే గుండెమాటు భానుజ్వలనం
ఎవడికి వాడు పొంతనగాడు
సరియగు జాన ఒక్కడులేడు
ఎవరులేని ఒంటరైతే ఎం
బలంలేని బ్రతుకైతే నేం?
చల్లటి సెలయేటి నీళ్ళే
బండల కొనలు కరిగించలేదా
సరియగువేళ పెను ఉప్పెనై
చప్పుడులేక లోకం ముంచలేదా.
నర్తించుతూ వెళ్లకు నిన్ను కీర్తించు వేళ
జడంఐ కదలకుండకు లోకం నిందించువేళ
చెక్కు కళల కరములతో శిలల చెక్కిల్లపై
చెరిగిపోని మరోచరిత్ర
భవిష్యత్తు మార్చలేని కొత్త రాత
ఈ విశ్వం ఒప్పలేని అద్భుతమైన కథ

If you want to get ths beautiful Telugu Kavithalu on your Whatsapp Then type "KAVITHALU" and send to me my whatsapp

Whatsapp📱:9951017979
Writer🖋:సృతన్

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి