Saturday, September 28, 2019

హృషీకేశ


                                            హృషీకేశ   

                                                           
www.telugukavithalu.in

హృషీకేశ

నిరుతో నిండిన కొలనులో
గజం అరిచేనట గతిలేక కాదు
ఆద్యుడు వినినడా లేదాని
సందేహం మనస్సును కలిచినదట
మొసలి కరిచిన కాలుకి బాధలేదంట
విభుడు విస్మరించిన విషయమే
గొంతున కలుక్కుమన్నదట
రాతిని నాతిగా మలిచిన పాదం
తనకై రానందుకు
వివస్వత వెలుగులు కానరాలేదంట
గుడాకాన్ని గెలిచిన కన్నులకు
తన నివాసం మరిచినదంట
మరణపు అంచున
జగన్నాథనివాసం కలగన్నందున
కన్నీరు హాస్యాస్పదం అయినదట
వైకుంఠం దక్కుతున్న కూడ.
.......   .......    .......   .......
హృషీకేశుడు వినినంతనే
పత్నిని వీడేనంట
ఆయుధం అందుకోలేదంట
పరివారం మరిచినవాడయ్యే
సర్వం విడి వాహనం లేనివాడయి
దుఃఖం తెలియని కన్నులు ఏకదారాలు కార్చేనట
వచ్చేనట "గజాప్రాణవ వోత్పా హియై"

కృష్ణంవందే:జగద్గురుమ్

Whatsapp📱:9951017979
🖋:సృతన్

No comments:

Post a Comment