నా విరహపథం

https://www.telugukavithalu.in/

ఈ పౌర్ణమిక కుసుముంలో
కుసుమింపచేసిన ప్రియరుతంగమ
వనాల మీద వర్షించే
తొలి వసంత  ఋతుపవనమా
మచ్చుకైనా ఒక్కసారి
మెరిసిపో!
నా జటాటవి శరీర విశ్వంపై
వేల తపస్సుల పుణ్యఫల
ని ఒంటిపై
చికట్లే వలల ముంగురులై
ఎన్నెన్ని వెన్నెల రేకులతో
అల్లుకుందో
దానిదేమి పుణ్యమో.
నిన్ను తాకిన పువ్వులే మువ్వలై
పరిమళాలే నాదలై
నలుదిక్కుల పరిమలించగా
సకల ప్రేమలు ముఖరించిపోవా!
ని మనస్సులో పొడుచుకొచ్చినవేల సుమజ్వాల
నా ఉషస్సు కంటికి
నియతి చితికిపోగా
అలిసిపోదా
దుఃఖహేతు గవేషణలో
ఇప్పటి నా 'విరహ' పథం.

Your/Sruthan Goud